telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జమ్మూ-కశ్మీర్‌ విభజన .. దార్జిలింగ్‌ నేతలలో కొత్త ఆశలు ..

again separate state slogan with J & K issue

జాతీయసమైక్యతకు సంబందించిన విషయాలను కూడా రాజకీయం చేసేంతగా భారతదేశంనేతలు దిగజారిపోయారు. అందుకే స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్లకు కూడా అభివృద్ధి అందని ద్రాక్షగానే ఉండిపోయింది. ఒకపక్క అట్టుడుకిపోతున్న జమ్మూకశ్మీర్ లో శాంతిస్థాపన చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతించాల్సిందిపోయి దానిని కూడా రాజకీయ చేస్తున్నారు కొందరు. తాజా జమ్మూ-కశ్మీర్‌ విభజన అంశంతో .. దార్జిలింగ్‌ నేతలలో కొత్త ఆశలు .. పశ్చిమబెంగాల్‌ను విభజించాలని, దార్జిలింగ్‌ను ‘చట్టసభతో కూడిన కేంద్ర పాలితప్రాంతం’గా చేయాలని పలువురు నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. దార్జిలింగ్‌లో గోర్ఖా, అనుబంధ తెగలదే పైచేయి. తమకు ప్రత్యేకరాష్ట్రం ఇవ్వడంతో పాటు… రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌ను అమలు చేయాలని వారు కోరుతున్నారు.

1986 నుంచి కొండ ప్రాంత ప్రజలు, రాజకీయ నేతలు గోర్ఖాలాండ్‌ ఉద్యమం చేస్తున్నారు. జమ్మూ-కశ్మీర్‌ విభజన నేపథ్యంలో భాజపా నేత, దార్జిలింగ్‌ ఎంపీ రాజు బిస్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. గోర్ఖా ప్రజల సమస్యకు మోదీ ప్రభుత్వం 2024 నాటికల్లా ‘శాశ్వత రాజకీయ పరిష్కారం’ చూపగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు రాష్ట్రం కావాల్సిందేనని, పశ్చిమ బెంగాల్‌ను విభజించి భాజపా తన హామీని నిలబెట్టుకోవాలని గోర్ఖా జనముక్తి మోర్చా ప్రధానకార్యదర్శి రోషన్‌ గిరి డిమాండ్‌ చేశారు. రాష్ట్రం జోలికొస్తే ఊరోకోబోమని తృణమూల్‌ నేత, రాష్ట్రమంత్రి గౌతమ్‌ దేబ్‌ కూడా తీవ్రంగా హెచ్చరించారు.

Related posts