telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

మళ్ళీ తగ్గనున్న .. వడ్డీరేట్లు.. ఆర్బిఐ సుముఖత..

RBI

మరోసారి రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) వడ్డీరేట్ల కోతకు మొగ్గుచూపనుందట. దేశ ఆర్థిక వృద్ధిని పెంచేందుకు గత రెండు ద్వైమాసిక సమీక్షల్లో కీలక వడ్డీరేట్టను తగ్గించిన ఆర్‌బీఐ జూన్‌లో జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గించే అవకాశాలున్నట్లు ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ అంచనా వేస్తోంది.

దేశీయంగా, అంతర్జాతీయంగా వృద్ధి నెమ్మదించడం, భారత్‌లో ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యాల కంటే తక్కువగా ఉండటంతో జూన్‌లో రిజర్వ్‌ బ్యాంక్‌ మరోసారి వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నాయి. అయితే జూన్‌ తర్వాత ద్రవ్యోల్బణ ఒత్తిడి, ద్రవ్యలోటును దృష్టిలో పెట్టుకుని రేట్ల కోతకు మొగ్గుచూపకపోవచ్చు. అంటే జూన్ తర్వాత 2019-20 ఆర్థిక సంవత్సరంలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చుగ అని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ తాజా నివేదికలో తన అంచనాలు వెల్లడించింది.

Related posts