telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మా”లో మళ్ళీ ముదురుతున్న వివాదం

again issues raised in maa association

మరోసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో వివాదం చెలరేగింది. నరేష్ పనితీరుపై జీవిత రాజశేఖర్ మధ్య అసహనం వ్యక్తం చేయడంతో వివాదం కోర్టు వరకు వెళ్లింది. నరేష్ పని తీరుపై చర్చించి, సమస్యలు పరిష్కరించుకుందామంటూ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఈసీ మెంబర్లకు జీవితారాజశేఖర్ దంపతులు మెసేజ్ పెట్టారు. అయితే ఈ సమావేశంపై నరేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అధ్యక్షుడు లేకుండా మీటింగ్ ఎలా పెడతారంటే నరేష్ తరపు లాయర్ రాజశేఖర్‌ను ప్రశ్నించారు. ఇది జనరల్ బాడీ మీటింగ్ కాదని, ఫ్రెండ్లీ సమావేశమనేనని జీవితారాజశేఖర్ చెబుతున్నారు. గత కొంత కాలంగా నరేష్‌, జీవితా రాజశేఖర్‌ల మధ్య దూరం పెరుగుతున్న నేపధ్యంలో ఈ వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. అయితే సమావేశానికి హాజరైన పరుచూరి గోపాల కృష్ణ కొందరు సభ్యుల తీరు నచ్చక సమావేశం మధ్యలోనే తిరిగి బయటకు వచ్చేశారు. అయితే తాను కన్నీళ్లు పెట్టుకుని బయటకు వచ్చాననేది నిజం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నారంటూ కొన్ని ఛానళ్లలో వార్తలు రావడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. అయితే ఈ వార్తలను ఆయన ఖండించారు. ఇవాళ జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశానికి హాజరైన తాను కన్నీళ్లు పెట్టుకున్నానంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. సమావేశంలో కొందరు సభ్యుల తీరు నచ్చక తాను బయటకు వచ్చేశానని చెప్పారు. అంతే కానీ, తానేదో కన్నీరు పెట్టుకున్నానంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఆ వార్తలు కేవలం పుకార్లేనన్నారు.

మా అధ్యక్షుడు నరేష్‌ సమావేశానికి రావాలని జీవిత రాజశేఖర్‌ పేర్కొన్నారు. మాలో కొనసాగుతున్న అంత ర్గత సమస్యలపై నరేష్‌ స్పందించాలని ఆమె డిమాండ్‌చేశారు. అలాగే నరేష్‌ అందరినీ కలుపుకుని పోవాలని అన్నారు. సమావేశంలో ఏకాభిప్రాయం కుదరకపోతే జనరల్‌బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటామని ఆమె స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా జనరల్‌బాడీ మీటింగ్‌ను జీవితా రాజశేఖర్‌ నిర్వహించడం సరికాదని, సమావేశంలో పరుచూరి గోపాల కృష్ణకు అవమానం జరిగిందని పృధ్వీ అన్నారు. ఎవరికి వారు గ్రూపులు పెట్టుకున్నారు. ఈ విషయంలో చిరంజీవి, కృష్ణంరాజు జోక్యంచేసుకోవాలని లేదంటే కమిటీని రద్దుచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Related posts