telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

మళ్ళీ వరదలు … అప్రమత్తంగా ఉండాలి.. : ఆర్టీజీఎస్

huge rain water flow in godavari useful for farmers

గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) తెలిపింది. ఫలితంగా గోదావరికి మళ్లీ వరద వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. నదీ తీర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు, కృష్ణానదికి ఇటీవల వచ్చిన వరదలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టినట్టు ప్రభుత్వం తెలిపింది. ఆయా ప్రాంతాల్లో బాధితులకు ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్‌, కిలో కందిపప్పు, లీటరు పామాయిల్‌, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు ఇవ్వనున్నట్టు పేర్కొంది.

కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయవ్య జార్ఖండ్, బీహార్ పరిసరాలను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో మధ్య ప్రాంతం నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఒడిశా, ఉత్తర కోస్తా మీదుగా ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. ఈ కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో నేడు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Related posts