telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మరోసారి అమెరికాలో.. కాల్పులు.. 5మృతి… అదుపులో నిందితుడు..

again fireing in america costs five lives

ప్రజలపై తుపాకీ పేలడం అమెరికాలో సహజం అన్నంత సులభంగా కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిసారి ఎంతో మంది సామాన్యులు ఈ కాల్పులలో మృతిచెందుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఏమి చేయలేకపోతోంది. వీటిని ప్రభుత్వమే తమ దేశంలో వలసవాదులు బెదిరించేందుకు చేస్తున్న ప్రయత్నంగా కూడా కొందరు అభివర్ణిస్తున్నారు.

తాజాగా మరోసారి అమెరికాలో తుపాకి గర్జించింది. ఫ్లోరిడాలోని ఓ బ్యాంకులో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. రాష్ట్రంలోని సెంబ్రింగ్ నగరంలోని సన్‌ట్రస్ట్ బ్యాంకులోకి ప్రవేశించిన యువకుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. నిందితుడిని సెంబ్రింగ్‌కే చెందిన జీపెన్ జావర్ (21)గా గుర్తించారు. దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్టు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారు బ్యాంకు ఉద్యోగులా.. ఖాతాదారులా? అనే విషయంలో స్పష్టత లేదు. ఇదో భయంకరమైన ఘటన అని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts