telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

హైదరాబాద్ : .. అధికారులతో దోబూచులాడుతున్న డ్రగ్స్, ఎలాగోలా అందుబాటులోకి..

1000 Crores Ddrugs seized Bomba

మరోసారి నగరంలో డ్రగ్ భారీగా పట్టుబడ్డాయి. వచ్చేకొద్దీ నగరం పేరుతో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆబ్కారీ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఇటీవలే మూడు కొకైన్ కేసులను పట్టుకున్న అధికారులు తాజాగా కొకైన్ విక్రయిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 4గ్రాముల కొకైన్‌తో పాటు 1.40లక్షల నగదు, ఐదు సెల్‌ఫోన్స్, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ నాలుగురోజుల క్రితం గోల్కొండ ఖాదర్‌బాగ్‌లో కొకైన్ సరఫరా చేస్తూ పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఆబ్కారీ అధికారులు మరికొన్ని కొకైన్ ముఠాలపై నిఘాపెట్టారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్‌నెం.1, జీవీకే ప్రాంతంలో ఆబ్కారీ అధికారులు రూట్‌వాచ్ నిర్వహించారు. ఆ సమయంలో నైజీరియా దేశానికి చెందిన సామ్యుల్ స్మిత్, మార్క్ ఒలబేలు ద్విచక్రవాహనంపై కొకైన్‌ను తరలిస్తూ అక్కడ రూట్‌వాచ్ నిర్వహిస్తున్న అధికారులకు పట్టుపడ్డారు. ఈ మేరకు అధికారులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించంగా ఇటీవల గోల్కొండ ప్రాంతంలో పట్టుబడిన జేడి పాస్కల్ సూచనల మేరకు కొకైన్‌ను విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.

నాలుగురోజుల క్రితమే జేడీ పాస్కల్, చిమ్మ గుడ్‌లక్, ఉచెన్న సామ్యుల్‌లను ఆబ్కారీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శనివారం పట్టుబడిన నిందితులను తదుపరి విచారణ నిమిత్తం అమీర్‌పేట ఎక్సైజ్ స్టేషన్ అధికారులకు అప్పగించారు. జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ నంద్యాల అంజిరెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ దాడుల్లో ఇన్‌స్పెక్టర్ ఇ.చంద్రకుమార్, ఎస్‌ఐ నజీర్‌హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts