telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సాంకేతిక

హైదరాబాద్‌ : … పిల్లలు, యువతీ యువకుల భవిష్యత్తును నాశనం చేస్తున్న .. పబ్జి గేమ్స్‌ను నిషేధించాలి ..

hyderabadi school student died on pubg

పబ్జిగేమ్స్‌ బారినపడి పిల్లలు, యువతీ యువకులు బానిసలుగా మారుతున్నానని, ప్రభుత్వం వెంటనే పబ్జి గేమ్స్‌ను నిషేధించాలని బాలల హక్కుల సంఘం డిమాండ్‌ చేసింది. ఇలాంటి గేమ్స్‌ల బారినపడి వారు తమ విలువైన భవిష్యత్తును నాశనంచేసుకుంటున్నారని సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా పబ్జిగేమ్స్‌కు మోజులో ఎంతో మంది పిల్లలు తబ జీవితాలను పణంగా పెడుతున్నారని అన్నారు.

తాజాగా విజయనగరంలో లోహిత్‌ అనే విద్యార్ధి విషం తాగి ఆత్మహత్య చేసుకోడం ఈగేమ్స్‌ పిల్లల పై ఏస్థాయిలో ప్రభావం చూపిస్తుందో స్పష్టమైందన్నారు. సామాజిక బాధ్యతగా భావించి స్మార్ట్‌ఫోన్‌ల తయారీ దారులు ఫోన్‌లలో పబ్జివంటి గేమ్స్‌కు ఆప్షన్‌ ఇవ్వరాదని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ ఐటి మంత్రిత్వశాఖ పబ్జిగేమ్స్‌ నిషేధానికిచర్యలు తీసుకోవానిని, అలాగే దీనిని జువెనైల్‌ జస్టిస్‌యాక్ట్‌ పరిధిలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Related posts