telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సూపర్ గర్ల్ గా గ్లామర్ డాల్ అమీ జాక్సన్

Amy

హాట్ బ్యూటీ అమీ జాక్సన్ విషయానికొస్తే “మద్రాసు పట్టణం” చిత్రంతో సినిమాల్లోకి తెరంగ్రేటం చేసింది. తరువాత హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లోనూ నటించింది అమీ. చివరిగా సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన “2.0” చిత్రంలో నటించింది అమీ. గ్లామర్ డాల్ అమీ జాక్సన్ ఇటీవలే ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది. ఈ హాట్ బ్యూటీ గత రెండేళ్లుగా మల్టీ మిలియనీర్ జార్జ్ పనాయిటౌతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. 2019 జనవరిలో జార్జ్ తో అమీ ఎంగేజ్మెంట్ జరిగింది. జార్జ్ బ్రిటన్ కు చెందిన ఓ కుబేరుడు. హిల్టన్, పార్క్ ప్లాజా, డబుల్ ట్రీ లాంటి లగ్జరీ హోటల్స్ ను నిర్వహిస్తున్నాడు. 2020 ఆరంభంలోనే ఈ జంట పెళ్లికి రెడీ అవుతున్నారని ప్రచారమైంది. కానీ అది జరగలేదు. అయితే త్వరలో ఈ బ్యూటీ తిరిగి కెమెరా ముందుకు రాబోతుంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు సూపర్ గర్ల్ గా ఓ టీవీ సిరీస్ లో నటించి అదరగొట్టిన ఎమీ ప్రస్తుతం ఓ అమెరికన్ సూపర్ మెన్ సిరీస్ ని అంగీకరించిందని, అందులో సూపర్ గర్ల్ గా కనిపించబోతోందని సమాచారమా. తాజాగా సెట్ లో మేకప్ వేసుకుంటున్న ఫొటోలని ఎమీ అభిమానుల కోసం షేర్ చేసింది.ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts