telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

చిట్టగాంగ్‌ : … భారీ ఆధిక్యం దిశగా .. ఆఫ్ఘన్‌ …

afghanistan on huge score

ఆఫ్ఘన్‌ ప్రత్యర్థితో ఒక్క టెస్ట్ మాత్రమే ఆడుతున్నా, బంగ్లాదేశ్‌ పై భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. 137పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆఫ్ఘన్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 237/8తో నిలిచింది. ఇబ్రహీం జర్దాన్‌ కీలక ఇన్నింగ్స్‌(87)తో ఆకట్టుకున్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో తృటిలో సెంచరీ కోల్పోయిన ఆస్ఘర్‌ ఆఫ్ఘన్‌ మరో అర్ధ సెంచరీ(50)తో ఆకట్టుకున్నాడు. అఫ్సర్‌ జజాయ్‌(34), యామిన్‌ లహ్మద్‌జాయ్‌ క్రీజులో ఉన్నారు. షకీబ్‌ 3 వికెట్లతో రాణించగా, తైజుల్‌ ఇస్లాం, నయీం హసన్‌ చెరో రెండు వికెట్లు సాధించారు. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 205 పరుగులకు ఆలౌట్‌ అయింది. మొమినల్‌ హక్‌(52), మొసాదిక్‌ హుస్సేన్‌ (48) రాణించారు. ఆఫ్ఘన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ 5 వికెట్లు సాధించాడు.

Related posts