telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఆఫ్ఘన్ కు .. భారత్ లో హోమ్ గ్రౌండ్..

afghanistan home ground in india

ఆఫ్ఘనిస్తాన్ లఖ్‌నవూలోని ఎకానా స్టేడియాన్ని తమ హోమ్‌ గ్రౌండ్‌గా పేర్కొంది. బీసీసీఐ తమ అభ్యర్థనని అంగీకరించిందని, లఖ్‌నవూలోని స్టేడియాన్ని హోమ్‌ గ్రౌండ్‌గా అనుమతిచ్చిందని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌ బోర్డు సీఈవో అసదుల్లా ఖాన్‌ తెలిపారు. గత కొన్నేళ్లుగా తమ దేశంలోని భద్రత దృష్ట్యా బీసీసీఐని హోమ్‌గ్రౌండ్‌ కోసం ఆఫ్ఘనిస్తాన్ అభ్యర్థిస్తోంది . దీనికి స్పందిస్తూ డెహ్రాడూన్‌, నోయిడాలోని స్డేడియాలను గతంలో ఆఫ్ఘనిస్తాన్ హోమ్‌గ్రౌండ్‌గా బీసీసీఐ అంగీకరించింది. కానీ, డెహ్రాడూన్‌లో ఫైవ్‌ స్టార్‌ వసతులు లేకపోవడంతో అఫ్గాన్‌ వేరే మైదానం కోసం అనుమతి కోరింది.

దీంతో క్రికెట్‌ పాలకుల కమిటీ లఖ్‌నవూలోని అటల్‌ బిహారి వాజ్‌పేయీ ఇంటర్నేషనల్‌ స్టేడియాన్ని అఫ్గాన్‌ హోమ్‌ గ్రౌండ్‌గా అనుమతిచ్చింది. భద్రత, సౌకర్యాల దృష్ట్యా తమ సొంత దేశంలో ఆఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించట్లేదు. బీసీసీఐ మా అభ్యర్థనను అధికారికంగా అంగీకరించింది. డెహ్రాడూన్‌లో ఫైవ్‌స్టార్‌ వసతులు లేవు. దీని వల్ల అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించడంలో మాకు సమస్యలు తలెత్తుతున్నాయి. లఖ్‌నవూలో ఇలాంటి సమస్యలు ఎదురవ్వవు.. అని ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు సీఈవో అసదుల్లా ఖాన్‌ వెల్లడించారు.

Related posts