telugu navyamedia
political trending

పాక్ లో పుట్టి.. భారత్ ను ప్రేమిస్తున్న సైన్యం..!!

adnan sami on pulwama attacks

ఇటీవల జరిగిన పుల్వామా దాడిపై ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సమీ.. తనపై కామెంట్లు చేస్తున్న పాకిస్థానీ నెటిజన్లకు దీటైన జవాబిచ్చారు. పాకిస్థాన్‌లో పుట్టిన సమీ.. కొన్నేళ్ల క్రితం భారత పౌరసత్వం తీసుకున్నారు. ఇటీవల భారత వైమానిక దళం.. పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు చేసిన నేపథ్యంలో సమీ భారత్‌కు మద్దతిస్తూ… ‘భారత వైమానిక దళం పట్ల ఎంతో గర్వంగా ఉంది. ఉగ్రవాదాన్ని ఆపండి. జైహింద్’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో పుట్టి.. భారత్‌కు మద్దతిస్తున్నారంటూ పలువురు పాకిస్థానీ నెటిజన్లు సమీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అద్నాన్‌ సమీ వారికి ట్విటర్ వేదికగా దీటైన సమాధానం ఇచ్చారు. ‘డియర్‌ పాక్‌ ట్రోల్స్‌.. ఇక్కడ మీ ఈగో విషయం కాదు. మీరు శత్రువులుగా భావిస్తున్న ఉగ్రవాదులను ఏరిపారేయడం ఇక్కడ విషయం. మీ నీచమైన మెంటాలిటీ పట్ల నవ్వొస్తోంది. మీరు అనే మాటలే మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts

ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే అమరావతికి వచ్చా: చంద్రబాబు

vimala p

లగ్జరీ హోటల్ లో ఫుడ్ ఆర్డర్ చేసిన హీరోయిన్… అందులో పురుగులు చూసి…!?

vimala p

టర్కీ : .. సెంట్రల్ బ్యాంకు గవర్నర్ తొలగింపు.. ప్రమాదమే అంటున్న నిపుణులు..

vimala p