telugu navyamedia
news study news Telangana trending

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభం..

వరంగల్ అర్బన్ జిల్లాలోని కాళోజి హెల్త్ యూనివర్సిటీ లో ఎంబీబీఎస్, బి డి ఎస్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. దీనిపై కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. కాళోజి హెల్త్ యూనివర్సిటీ లో ఎంబీబీఎస్, బి డి ఎస్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని…ఇప్పటి వరకు 6వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. నిట్ ర్యాంకు ఉన్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని..రాష్ట్ర వ్యాప్తంగా 4800 సీట్లతో అటుగా ఈడబ్ల్యుఎస్ 190 సీట్లు ఉన్నాయని తెలిపారు. గవర్నమెంట్ కాలేజీలల్లో 1500 సీట్లు, ప్రయివేట్ కాలేజీలల్లో 2750 సీట్లు, మైనార్టీ కాలేజీలల్లో 550 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఒక్క కొత్త కాలేజీ వచ్చిందని..13 డెంటల్ కాలేజీ 1340 సీట్లు ఉన్నాయన్నారు. వెబ్ ఆప్షన్లు ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతుందని..కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ సర్టిఫికేట్ వేరిఫికేషన్ చేస్తామని తెలిపారు. కాలేజ్ స్టాట్ అయిన తరువాత ఫిజికల్ వేరిఫికేషన్ అని..అల్ ఇండియా కోటలో వెళ్లిన వారు సర్టిఫికెట్ అప్లోడ్ చేయకపోతే నాట్ క్వాలిఫైడ్ అని పేర్కొన్నారు. కరోనా ను బట్టి ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకే క్లాసెస్ స్టార్ట్ చేస్తామన్నారు.

Related posts

గర్ల్ ఫ్రెండ్ తో తిరగొద్దంటూ స్టార్ హీరోయిన్ కు దర్శకుడి హెచ్చరిక

vimala p

“గ్యాంగ్ లీడర్” ప్రీమియర్ షో టాక్

vimala p

పెళ్ళి పీటలెక్కనున్న పునర్నవి భూపాలం

vimala p