telugu navyamedia
సినిమా వార్తలు

నాని ఎలాంటి వాడో చెప్పేసిన అదితి

Aditi Rao Hydari images

నేచుర‌ల్ స్టార్ నాని ఇటీవలే “జెర్సీ”తో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. నాని త‌న 25వ సినిమా “వి” రెగ్యుల‌ర్ షూటింగ్‌ను త్వ‌ర‌లోనే స్టార్ట్ చేయ‌బోతున్నారు. ఇటీవ‌లే ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. నానితో పాటు సుధీర్ బాబు న‌టిస్తున్నాడు. నాని ఈ చిత్రంలో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు బ్యాన‌ర్‌లో సినిమా నిర్మితంకానుంది. అదితిరావు హైద‌రి, నివేదా థామ‌స్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఓ ప్రైవేట్ కార్‌రక్ర‌మంలో పాల్గొన్న అతిథి రావు హైద‌రి నానితో క‌లిసి న‌టించ‌డం గురించి మాట్లాడుతూ “నాని చాలా ఫ‌న్ ప‌ర్స‌న్‌. త‌నంటే ఎంతో గౌరం ఉంది. అమేజింగ్ యాక్ట‌ర్‌. చాలా సహజంగా న‌టిస్తాడు. నానితో ప‌ని చేయ‌డానికి చాలా ఆస‌క్తిగా, ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాను” అన్నారు

Related posts