telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు విద్యా వార్తలు

పది పరీక్షలు రాసిన విద్యార్థులకు శుభవార్త!

Degree exams TDP questiona Anantapur

తెలంగాణలో పదో తరగతి గణితం పరీక్షల్లో తప్పుడు ప్రశ్నలకు గాను ఆరు మార్కులను కలపాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకొంది. గణితం పరీక్షల్లో తప్పుడు ప్రశ్నలకు గాను విద్యార్థులకు న్యాయం చేయాలని నిర్ణయించింది. గణితం ఒకటో పేపర్లో ఐదున్నర మార్కులను గణితం రెండో పేపర్లో అర మార్కును కలపాలని నిర్ణయం తీసుకొన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఈ విషయమై తమకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ ఆరు మార్కులను కలపాలని నిర్ణయం తీసుకొంది. విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో తాము ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా తెలంగాణ విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఈ ప్రశ్నలకు జవాబు రాసేందుకు ప్రయత్నించిన విద్యార్థులకు మాత్రమే ఈ ఆరు మార్కులను కలపాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకొంది.

Related posts