telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ ఐదింటిని ఓకే చేసేసిన ఆదాశర్మ

టాలీవుడ్ లో ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది అదాశర్మ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఫరవాలేదనిపించిన ఈ బ్యూటీకి మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ విన్యాసాలతో ఫోటో షూట్‌లు చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.  అయితే అదాశర్మ కల్కి సినిమా తరువాత తెలుగులో ఎక్కడా కనిపించలేదు. 2019లో కల్కి సినిమా తరువాత హిందీ సినిమాలకే పరిమితం అయింది. అయితే ఈరోజుతో అదాశర్మకి మంచి గుర్తింపు తెచ్చిన క్షణం సినిమా విడుదలయ్యి 5 సంవత్సరాలు అయ్యాయి. ఈ సందర్భంగా అదాశర్మి ఓ న్యూస్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘నేను ఏ భాషలో చేసిన అందరూ నన్ను ఆదరించారు. అందుకు అందరికీ ధన్యవాదాలు. అయితే ఈరోజు నేను అందరితో ఓ వార్త పంచుకోనున్నాను. తెలుగులో కొత్తగా నేను మరో ఐదు సినిమాలను ఓకే చేశాను. అన్నీ కూడా ఎంతో ప్రయోగ భరితంగా తెరకెక్కనున్నాయ’ని తన ఇన్‌స్టా ద్వారా తెలిపారు. చాలా కాలం తరువాత తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వనున్న అదాశర్మ ఎటువంటి కథలను ఎంచుకున్నారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Related posts