telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

విశాఖలో .. అదాని డేటా సెంటర్.. 1350 ఎకరాల కేటాయింపు.. !

8th white paper released by apcm babu
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖ నగరంలోని కాపులుప్పాడలో 1350 ఎకరాల్ని డేటా రంగానికి చెందిన కంపెనీలకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. దీనికి క్లౌడ్‌సిటీగా పేరుపెడుతున్నట్లు ప్రకటించారు. కాపులుప్పాడలో ఏర్పాటుచేస్తున్న అదాని డేటా సెంటర్‌, టెక్నాలజీ పార్క్‌లకు  మంత్రులు నారా లోకేష్‌, గంటాశ్రీనివాసరావు, కిడారి శ్రావణ్‌కుమార్‌లతో కలిసి  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అదానీ సంస్థ ఇక్కడ రూ.70 వేల కోట్లు పెట్టుబడి పెడుతోందని, ఒప్పందం కుదుర్చుకున్న 35 రోజుల్లో పునాదిరాయి వేశామని తెలిపారు. అదాని గ్రూప్‌ను రప్పించే విషయంలో, తనపై ఒత్తిళ్లు వచ్చినా వాటికి తలొగ్గలేదని స్పష్టం చేశారు.
భవిష్యత్తు డాటా ఆధారంగా నిర్ణయమవుతుందని, ఈ డేటా సెంటర్‌కు పునాదిరాయి పడటంతో మరెన్నో పరిశ్రమలు ఇక్కడికి తరలివచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తాను ఉత్తమ మార్కెటింగ్‌ మేనేజర్‌నని, ఏ అవసరం వచ్చినా తనని సంప్రదించాలని అదానీ సంస్థ ఎండీ రాజేష్‌ అదానీకి  చెప్పారు. గతంలో పాలన తీరుతెన్నులు గుర్తుచేసుకుంటూ.. ‘1984లో రికార్డులన్నీ కంప్యూటరీకరించేవాళ్లం. అప్పట్లో పెద్ద సర్వర్లు ఉండేవి. పార్టీ కార్యాలయానికి ఏసీ లేకున్నా సర్వర్ల కోసం ఏసీ పెట్టించేవాళ్లం. ఇప్పుడు సర్వర్లకు బదులు డేటా సెంటర్లు వస్తున్నాయి’ అంటూ చెప్పుకొచ్చారు. భోగాపురంలో విమానాశ్రయానికి శంకుస్థాపన చేసి తిరిగొస్తూ,  కాపులుప్పాడ పరిసరాలన్నీ చూశానని,  ఇక్కడున్న వనరులు చూస్తే సిలికాన్‌వ్యాలీ కన్నా బాగా మార్చవచ్చని అనిపిస్తోందని చెప్పారు. నార్తర్న్‌ వర్జీనియా దశాబ్దకాలంలో ఎంతో అభివృద్ధి సాధించని, అలాగే ఇక్కడ పచ్చదనాన్ని  పెంచడంతో పాటు పూర్తిగా విద్యుత్తు వాహనాలు నడిచేలా చేస్తామని తెలిపారు.

Related posts