telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వనితా విజయ్‌కుమార్‌ భర్తకు గుండెపోటు

Vanitha

తమిళ సినీ నటి, తమిళ బిగ్‌బాస్ ఫేం వనితా విజయ్‌కుమార్‌ భర్త పీటర్‌పాల్ కు గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తమకు మద్దతుగా నిలిచిన వారికి వనిత కృతజ్ఞతలు తెలిపింది. కాగా వనిత మూడో వివాహం సినీ వర్గాల్లో వివాదానికి కారణమైంది. ఆమె మూడో పెళ్లిని నటి కస్తూరి, నిర్మాత రవీంద్రన్, దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్‌ తదితరులు తప్పుపడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆపై వివాదం పోలీసు కేసుల వరకు వెళ్లింది. వనిత, లక్ష్మీరామకృష్ణన్‌లు పరస్పరం పరువునష్టం దావాలు కూడా వేసుకున్నారు.

Related posts