telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సొంత ఇల్లునే సెట్ గా మార్చేసిన తమన్నా

Tamannah

మిల్కీ బ్యూటీ తమన్నా చాలా రోజుల తర్వాత నిన్న కెమేరా ముందుకు వచ్చింది. ఈ ముద్దుగుమ్మ షూటింగ్ చేసింది కూడా ముంబైలోని తన ఇంట్లోనే కావడం విశేషం. ఈ విషయాన్ని తమన్నా సోషల్ మీడియాలో పంచుకుంటూ “ఓ షూట్ కోసం మా ఇల్లునే సెట్ గా మార్చేశాం. కెమేరా ముందుకు వెళ్లగానే ఒక్కసారిగా ఎంతో ఉత్సాహం వచ్చేసింది..” అంటూ పేర్కొంది. అన్ని జాగ్రత్తలూ తీసుకుని షూటింగ్ చేశామని తమన్నా చెప్పింది. అయితే అది ఏదైనా సినిమా షూటింగా? లేక యాడ్ ఫిలిం షూటింగా? అన్నది అమ్మడు వెల్లడించలేదు. కాగా కరోనా నేపథ్యంలో ఆగిపోయిన సినిమా షూటింగులు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయి. ఈ క్రమంలో తారలు ఒక్కొక్కరుగా ముందడుగు వేస్తున్నారు. ఇటీవలే నాగార్జున, మహేష్, అఖిల్, నాగ చైతన్య, పూజాహెగ్డే షూటింగులు చేయడానికి ముందుకొచ్చారు. ఇటీవల పూజాహెగ్డే సెట్లో ఉన్న ఫోటోను షేర్ చేయగా వైరల్ అయ్యింది. ఇప్పుడు తమన్నా కూడా కెమేరా ముందుకు వచ్చింది. మరోవైపు కరోనా భయంతో మరికొంతమంది నటీనటులు షూటింగులు చేయడానికి ఒప్పుకోవడం లేదు.

Related posts