telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన మిల్కీ బ్యూటీ

Taapsee

అందాల నటి తాప్సీ “ఝుమ్మంది నాదం” చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది. తెలుగులో తాప్సీకి అంత సక్సెస్ లు లేకపోయినప్పటికీ హిందీలో మాత్రం భారీ విజయాలను సాధించింది. అయితే తాప్సీ ప్రేమలో ఉందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎప్పుడు కూడా దానిపై నోరు మెదపలేదు. కానీ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ను కుటుంబ సభ్యులకు పరిచయం చేసింది. వాళ్లు ఓకే చెప్పాక అతన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. తాప్సీ ఇన్నాళ్లు బ్యాడ్మింటన్ ఆటగాడైన మాథియాస్ బోతో ప్రేమలో ఉంది. ఇన్నేళ్లు తన ప్రేమని దాచడానికి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలనుకోవడం కారణమని చెప్పుకొచ్చారు. ముందే చెప్పుంటే గత ఏడాది సాధించిన విజయాలు తనకు దక్కేవి కావేమో అని ఆమె అన్నారు. ఇక తాను ఎవరితోనో రిలేషన్ లో ఉన్నాననే విషయం తన కుటుంబానికి తెలుసన్నారు. తన తల్లిదండ్రులు, సోదరీమణులు ఇష్టపడని వ్యక్తిని తాను అంగీకరించలేనని తాప్సీ చెప్పింది.

Related posts