telugu navyamedia
సినిమా వార్తలు

తల్లికి హీరోయిన్ బెదిరింపులు… మహిళా కమిషన్ కు ఫిర్యాదు

Sangeetha

కన్న కూతురే తనను ఇంట్లో నుంచి గెంటేయడానికి ప్రయత్నిస్తోందని, ఈ ముసలి వయసులో నేను ఎక్కడికి వెళ్ళగలను అంటూ ఓ హీరోయిన్ సంగీతపై ఆమె తల్లి మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే… తమిళనాడు రాజధాని చెన్నైలోని వలసరవాక్కంలో సినీనటి సంగీత తల్లి భానుమతికి రెండంతస్థుల ఇల్లు ఉంది. కింది పోర్షన్ లో భానుమతి నివసిస్తుండగా, పై పోర్షన్ లో సంగీత, క్రిష్ దంపతులు ఉంటున్నారు. అయితే మామగారి నుంచి భానుమతికి సంక్రమించిన ఈ ఆస్తి ఇప్పుడు సంగీత పేరున ఉంది. దీంతో ప్రస్తుతం తన కూతురు సంగీత తనను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చేస్తోందంటూ భానుమతి ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజులక్రితమే సంగీత తమ్ముడు మృతి చెందడంతో అన్న తన తల్లిని అడ్డుపెట్టుకుని ఎక్కడ ఇల్లు కాజేస్తాడో అన్న భయంతో ఆమె ఇలా చేస్తోందని భానుమతి ఫిర్యాదులో పేర్కొన్నారు. భానుమతి ఫిర్యాదును స్వీకరించిన మహిళా కమిషన్ సంగీతకు నోటీసులు జారీ చేసింది. దీంతో మూడ్రోజుల క్రితం సంగీత తన భర్తతో కలిసి మహిళా కమీషన్ ఎదుట హాజరై ఈ విషయంపై వివరణ ఇచ్చారు. ఈ విషయం గురించి సంగీతను మీడియా ప్రశ్నించగా ఆమె బదులివ్వకుండా వెళ్లిపోయారు. కావాలంటే సినిమాల గురించి అడగమని, వ్యక్తిగత విషయాల గురించి చెప్పానని స్పష్టం చేశారు సంగీత.

Related posts