telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అందాలు ఆరబోస్తే తప్పేంటి ? : హీరోయిన్

Sanam-Shetty

కోలీవుడ్‌లో అంబులి, మ‌యై, విలాసం వంటి ప‌లు చిత్రాల్లో న‌టించిన స‌న‌మ్ ప్ర‌స్తుతం “టికెట్” సినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. వీటితో పాటు పలు వెబ్ సిరీస్‌ల్లోనూ న‌టిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెబ్ సిరీస్‌ల గురించి, అందులో హీరోయిన్ల అందాల ప్ర‌ద‌ర్శ‌న గురించి మాట్లాడింది. ఈ సందర్భంగా సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో న‌టించే హీరోయిన్లు అందాలు ఆరబోయ‌డం త‌ప్పేం కాద‌ని క‌న్న‌డ హీరోయిన్ స‌న‌మ్ షెట్టి వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. “తెర‌పై గ్లామ‌ర‌స్‌గా క‌నిపించ‌డంలో నాకెలాంటి అభ్యంత‌రాలూ లేవు. హీరోయిన్ల అందాల ఆరబోత త‌ప్పేం కాదు. ప్ర‌స్తుతం సినిమాల‌కు, వెబ్ సిరీస్‌ల‌కు మ‌ధ్య గీత చెరిగిపోయింది. వెబ్ సిరీస్‌లు మ‌రింత సృజ‌నాత్మ‌కంగా ఉంటున్నాయి. సినిమాల‌కు సెన్సార్ ఉంటుంది. వెబ్ సిరీస్‌ల‌కు అలాంటిది ఉండ‌దు. కాబ‌ట్టి క‌థ‌కు స‌రిపోయినంత గ్లామ‌ర‌స్‌గా న‌టించొచ్చు. అలాగే యువ‌త‌ను ఆక‌ట్టుకునే డైలాగ్‌లు కూడా చెప్పొచ్చు” అంటూ చెప్పుకొచ్చింది స‌న‌మ్.

Related posts