telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కాళికాదేవిగా సాయి పల్లవి.. భయపెడుతోన్న ఫస్ట్ లుక్…

ఫిదా సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది సాయి పల్లవి. ఆ తర్వాత విడుదలైన ఎంసిఏ కూడా హిట్ కావడంతో స్టార్ అయిపోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన కణం, పడిపడి లేచే మనసు, ఎన్జీకే, మారి 2 లాంటి సినిమాలు ఫ్లాప్ అయినా అమ్మడు క్రేజ్ మాత్రం తగ్గలేదు. గ్లామర్ షో విషయంలో స్క్రిప్ట్ డిమాండ్ చేసినా హాట్ సన్నివేశాలకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం విరాటపర్వం, లవ్‌ స్టోరీ చిత్రాలతో బిజీగా ఉంది. ఇక ఈ భామ హామిళంలోను అటు మలయాళం లోను సినిమాలు చేస్తుంది. అయితే.. ఇవాళ  సాయిపల్లవి జన్మదినం. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న ‘శ్యామ్ సింగ్ రాయ్’ సినిమా నుంచి కొత్త లుక్ ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. ఫ్రమ్ ద హోలీ ఘాట్స్ ఆఫ్ దేవి మాత అంటూ రిలీజ్ చేసిన సాయి పల్లవి లుక్ వైరల్ అవుతోంది. నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమా కలకత్తా నేపథ్యంలో రూపొందుతోంది. కృతిశెట్టి, మడోన్నా శెబాష్టియన్ ఈ చిత్రంలోని ఇతర ముఖ్యపాత్రధారులు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నీహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వంశీ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related posts