telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నెపోటిజంపై రేణూ దేశాయ్ కామెంట్స్

Renu

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు కారణం ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజం అంటూ నెటిజన్లు బాలీవుడ్ ప్రముఖులపై దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే. బైకాట్ బాలీవుడ్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. కాగా ఈ విషయంపై ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు స్పందించారు. ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేణుదేశాయ్ కూడా నెపోటిజం పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నెపోటిజం కేవలం సినీరంగం లోనే కాకుండా అన్ని రంగాల్లో ఉంటుందని అన్నారు. టాలెంట్ ఉంది దైర్యంగా నిలబడగలిగితే నెపోటిజంను జయించి సక్సెస్ ను అందుకోవచ్చన్నారు. సుశాంత్ చాలా సెన్సిటివ్ అనుకుంటాను. తనకు టాలెంట్ ఉంది కాబ‌ట్టి సినిమా రంగంలో సక్సెస్ అయ్యాడని అన్నారు. సుశాంత్ ఎమోషన్స్‌ను త‌ను బ్యాలెన్స్ చేసుకోలేక‌పోయాడనుకుంటా.. అందువల్లే డిప్రెస్ అయ్యాడని, ఫ్యామిలీ బ్యాగ్రౌండో, టాలెంట్‌లో న‌మ్ముకుని సినీ రంగంలోకి రాకూడదని, మ‌నోధైర్యం కూడా ఉండాలన్నారు. మ‌న‌ల్ని మ‌నం ఇక్క‌డ ప్రూవ్ చేసుకోవాలంటే చాలా మాన‌సిక ధైర్యం అవ‌స‌రమని చెప్పుకొచ్చారు రేణు.

Related posts