telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రవితేజ సరసన రాశిఖన్నా ?

rashi

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. కాగా ఈ సినిమాలో రవితేజ డ్యూయెల్ రోల్ చేయనున్నాడు. దాంతో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఫైనల్ చేసిన చిత్రబృందం, మరో హీరోయిన్ గా రాశి ఖన్నాను తీసుకోనున్నారని తెలుస్తోంది. కాగా ఈ సినిమా రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. తమిళంలో అరవింద స్వామి, త్రిష కలయికలో రానున్న ‘శతురంగ వెట్టై 2’ చిత్రాన్నే తెలుగులో రవితేజ చేయబోతున్నాడట. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇకపోతే ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తోన్న ‘క్రాక్’ సినిమా ఇప్పటికే సగం పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.

Related posts