telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పేమెంట్ విషయంలో … హాలీవుడ్ చాలా బెటర్ అంటున్న .. రాధిక

actress radhika on bollywood producers

రక్త చరిత్ర సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే. కాంట్రవర్శీ కామెంట్లకు కేరాఫ్‌గా నిలిచే ఈ అమ్మడు.. బాలకృష్ణతో లెజెండ్, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కబాలి సినిమాలలో నటించి దక్షిణదిలో క్రేజ్ తెచ్చుకుంది. బాలీవుడ్‌లో టాప్ హీరోలతో నటించిన ఈ భామ తెలుగు, తమిళం, హిందీ భాషలతో పాటు.. హాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తుంది. లేటెస్ట్‌గా ‘లిబర్టీ ఏ కాల్ టు స్పై’ అనే హాలీవుడ్ చిత్రంలో నటించింది రాధిక. అంతకుముందు ‘ది వెడ్డింగ్ గెస్ట్’తో హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ఈమె. అయితే లేటెస్ట్‌గా బాలీవుడ్‌కు, హాలీవుడ్‌కు తేడా ఏమిటి? అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

హాలీవుడ్‌లో పేమెంట్స్ అంతా పక్కాగా జరుగుతాయని, ఆర్టిస్టుల పేమెంట్స్ కరెక్ట్ సమయానికి వచ్చేస్తాయని. అక్కడి నిర్మాతలు పని అవ్వగానే డబ్బులు ఇచ్చేస్తారని, డబ్బుల కోసం ఆర్టిస్టులు అడుక్కునే పరిస్థితి అక్కడ ఉండదు.. అంటూ సంచలన కామెంట్లు చేసేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు రెమ్యునరేషన్ ఇవ్వకుండా సతాయించే బాలీవుడ్ నిర్మాతలకు పరోక్షంగా తగిలినట్లైంది. హాలీవుడ్‌లో జనాలు క్రమశిక్షణ, నిబద్దతతో ఉంటారని, ఇండియాలోలాగా హాలీవుడ్‌లో పనిచేసే నటీనటులకు డబ్బు కోసం అడుక్కునే అవసరం రాదని చెప్పిన ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు నటులకు డబ్బులు ఎగ్గొట్టే చురకలు అంటించినట్లైంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే హాలీవుడ్ చిత్రం లిబెర్టే: ఏ కాల్ టు స్పైలో రాధికా ఆప్టే బ్రిటీష్ గూఢచారి నూర్ ఇన్యత్ ఖాన్ అలియాస్ నోరా బేకర్ అనే పాత్రలో కనిపించబోతుంది. నాజీల వశంలో ఉన్న ఫ్రాన్స్‌లో పారాచూట్‌లో వైర్‌లెస్ ఆపరేటర్‌గా కనిపించబోతున్నట్టు వెల్లడించింది.

Related posts