telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనురాగ్‌ కశ్యప్ కు రాధికా ఆప్టే సపోర్ట్

Radhika

నటి పాయల్‌ ఘోష్‌ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనపై అత్యాచారం చేయబోయాడని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. “కశ్యప్‌లోని రాక్షస కోణాన్ని ప్రజలకు చూపెట్టండి. అతడిని వదలొద్దు. నేను ఇలా బయటపడటంతో నా భద్రతకు ముప్పు అని నాకు తెలుసు. సాయం చేయండి” అంటూ ప్రధాని నరేంద్ర మోడీని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వేడుకుంది పాయల్. ఆమె వ్యాఖ్యలపై స్పందించిన దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ట్విట్టర్ వేదికగా ఆ ఆరోపణలన్ని నిరాధారమైనవన్నారు. ఈ కాంట్రవర్సీలో బాలీవుడ్ ప్రముఖులు అనురాగ్ కశ్యప్ కు సపోర్ట్ చేస్తున్నారు. గతంలో కంగనా రనౌత్ కూడా అనురాగ్ పై ఇదే తరహా వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో నటి కంగనా రనౌత్ కూడా పాయల్ ఘోష్ కి మద్ధతు తెలుపుతూ ‘మీటూ’ ‘అరెస్ట్ అనురాగ్ కశ్యప్’ అంటూ ట్వీట్ పెట్టింది.అయితే తాజాగా అనురాగ్ కశ్యప్ కు మద్దతు తెలిపింది బాలీవుడ్ భామ రాధికా ఆప్టే. ”అనురాగ్.. మీరు నా క్లోజ్ ఫ్రెండ్స్ లో ఒకరు. మీరు ఎల్లప్పుడూ నాకు సపోర్ట్ గా ఉన్నారు. మనం ఒకరికొకరు కలిగి ఉన్న పరస్పర ప్రేమను గౌరవాన్ని నేను ఎంతో ఆదరిస్తాను. నాకు మీరు తెలిసిన రోజు నుండి నేను ఎల్లప్పుడూ మీ దగ్గర ఎంతో భద్రంగా ఉన్నాను. మీరు ఎప్పటికీ నా నిజమైన ఫ్రెండ్. లవ్ యా..” అంటూ అనురాగ్ కు తన మద్దతు తెలిపింది రాధికా ఆప్టే.

Related posts