telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇద్దరి మధ్య స్నేహం తప్ప ఏమీ లేదు… డేటింగ్ రూమర్స్ పై పునర్నవి

punarnavi

‘బిగ్ బాస్’ సీజన్ 3లో పునర్నవికి ఎక్కడలేని పాపులారిటీ వచ్చేసింది. ముఖ్యంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ఆమెస్నేహం ‘బిగ్ బాస్’ షోకే ఒక క్రేజ్ తీసుకొచ్చింది. కెమిస్ట్రీ వర్కవుట్‌ అవడంతో ఇద్దరూ డేటింగ్‌ లో ఉన్నారంటూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ వార్తలపై పునర్నవి నోరు విప్పింది. రాహుల్‌, తాను మంచి స్నేహితులమని, ఇద్దరి మధ్య స్నేహం తప్ప మరొకటి ఏమీ లేదని స్పష్టం చేసింది. ఇటీవలే ఓ పబ్ లో పునర్నవిపై కామెంట్లు చేసిన వారిపై రాహుల్‌ సిప్లిగంజ్‌ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారన్న విషయాన్ని కొట్టిపారేసింది. తాను ఒత్తిడిలో ఉన్నట్లు చెప్పిన పునర్నవి… ఇప్పుడిప్పుడే అందులో నుంచి బయటపడుతున్నట్లు ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించింది.

Related posts