telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ ముగ్గురు హీరోయిన్లే డిమాండ్ చేస్తారు… హీరోయిన్లపై ప్రియమణి కామెంట్స్

Priyamani,Sirivennela Movie Title Announcement

ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని ఎన్నో ప్రశంసలు అందుకున్న ప్రియమణి… తెలుగులో పలు కమర్షియల్ చిత్రాల్లో నటించి మెప్పించింది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కాస్త దూరమైంది. అయితే తాజాగా ఓ చిత్రంలో నటించేందుకు ఒప్పుకుంది. ఏ ఎన్ బి కోర్డినేటర్స్ బ్యానర్ పై ఏ ఎన్ భాషా, రామ సీత నిర్మాతలుగా ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో తెరకెక్కించనున్న “సిరివెన్నెల” అనే చిత్రం ద్వారా ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తెలుగు చిత్ర సీమలో క్లాసిక్ మూవీగా చెప్పుకునే “సిరివెన్నెల” సినిమా టైటిల్ ఇన్నాళ్ల తర్వాత మరోసారి వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా ప్రియమణి హీరోయిన్ల పారితోషికం విషయంలో టాలీవుడ్ లో వివక్ష కొనసాగుతోందనే విషయంపై స్పందించారు. “బాలీవుడ్ కంటే దక్షిణాదిన పరిస్థితి మరింత దారుణం. ఒక సినిమా విజయవంతమైనప్పటికీ హీరోయిన్‌కు పెద్దగా ఉపయోగం ఉండదు. కానీ, హీరో పారితోషికం మాత్రం తర్వాతి సినిమాకు భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం సమంత, అనుష్క, నయనతార వంటి హీరోయిన్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. ఇప్పటికైనా మహిళలు రెమ్యునరేషన్ గురించి మాట్లాడడం సంతోషకర విషయమే” అని ప్రియమణి చెప్పింది. పారితోషికం విషయంలో తారతమ్యాల గురించి చాలా మంది హీరోయిన్లు కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా కోసం హీరోలు, హీరోయిన్లు ఒకేలా కష్టపడుతున్నప్పటికీ పారితోషికం విషయంలో మాత్రం చాలా తేడా ఉంటోందని, హీరోలు తీసుకునే పారితోషికంలో సగం కూడా హీరోయిన్లకు ఉండదని చాలా మంది ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్‌తో పోల్చుకుంటే దక్షిణాదిన ఈ వివక్ష మరింత ఎక్కువగా ఉంటుంది.

Related posts