telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ స్టార్ హీరో సెట్లోనే నాతో చాలా దారుణంగా వ్యవహరించారు : హీరోయిన్

Parvathi-Thiruvothu

సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్ వ్యవహారం, నెపోటిజం విషయాలు కుదిపేస్తున్నాయి. నెపోటిజంపై చాలామంది నటీమణులు ఇప్పుడు తమ గళం విప్పుతున్నారు. తాజగా మలయాళీ ఫైర్ బ్రాండ్, హీరోయిన్ పార్వతి తిరువోతు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ పార్వతి తిరువోతు ఓ స్టార్ హీరో గురించి చెబుతూ ఫైర్ అయ్యింది. మలయాళ సూపర్‌స్టార్లలో ఒకరైన స్టార్ హీరో సెట్లోనే తనతో చాలా దారుణంగా వ్యవహరించారని, షూటింగ్ జరిగినన్ని రోజులు ఆయనతో టార్చర్ అనుభవించానని చెప్పుకొచ్చింది పార్వతి. ఓ సారి హీరోయిన్ మీరా జాస్మిన్ గురించి తప్పుగా మాట్లాడరని తెలిపింది. తనకు, మీరాకు టాలెంట్ లేదని.. కేవలం దర్శకుల ప్రతిభ కారణంగానే మీకు విజయాలు అందాయని ఆయన అనడంతో షాక్ అయ్యాయని చెప్పింది. అంతేకాదు మా ఇద్దరికి ఏదో మానసిక రుగ్మత ఉందని కూడా ఆయన అన్నాడని తెలిపింది. ఆయన అలా ప్రవర్తించడానికి కారణాలేంటో తెలియదు కానీ.. ఎప్పుడూ ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూనే మాట్లాడేవారని, సెట్లో ఉన్నంత సేపు అసహనంతో ఊగిపోయేవారని పార్వతి చెప్పింది. మలయాళ చిత్ర పరిశ్రమలో తన లాగా ముక్కుసూటిగా మాట్లాడే వారిని తొక్కేస్తారని, మతిస్థిమితం లేదని ముద్రవేసి అవకాశాలు ఇవ్వరని ఆమె చెప్పడం సంచలనంగా మారింది. ఇటీవల ఆయనతో కలిసి పని చేశానని, ఆ సందర్భంలో తనతో ఆయన వ్యవహరించిన తీరుకు చాలా బాధేసిందంటూ ఆవేదన చెందింది. పెద్ద హీరోనే అయినా ఆయనలో తన స్థాయికి తగ్గ ప్రవర్తన కనిపించలేదని చెప్పిన పార్వతి, ఆ సూపర్ స్టార్ ఎవరనేది మాత్రం వెల్లడించలేదు.

Related posts