telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న మిల్కీ బ్యూటీ ?

Mehreen

“కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ” సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది మెహ్రీన్ ఫిర్జాదా కౌర్. ఆ తర్వాత మహానుభావుడు, రాజా దిగ్రేట్, జవాన్ తోపాటు పలు తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు అన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. “ఎఫ్-2” సినిమా హిట్ అయినా మెహరీన్ కు అంతగా పేరు రాలేదు. ఈ ఏడాది రెండు సినిమాలు చేసింది. “అశ్వద్ధామ” సినిమా కూడా ఆమె కెరీర్ కు ఉపయోగపడలేదు. అలాగే తమిళ చిత్రం “పట్టాస్” కూడా పెద్దగా హిట్ కాకపోవడంతో మెహ్రీన్ ఒక నిర్ణయానికి వచ్చిందట. ఇక డైరెక్ట్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తోందట. ఓటిటి ఫ్లాట్ ఫామ్స్ లో కూడా మెహ్రిన్ కి బాగానే అవకాశాలు వస్తున్నాయని తెలిసింది. దాంతో వెబ్ సిరీస్ లతోనైనా సరైన గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తుందట. మెహ్రిన్ కి కన్నడ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయని సమాచారం.

Related posts