telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

168వ సినిమాలో రజినీకాంత్ కు జతగా మీనా

Meena

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ యంగ్ హీరోలు సైతం షాకయ్యేలా వరుస సినిమాలు చేస్తున్నారు. ఒకవైపు రాజ‌కీయాల‌లో ఎంట్రీ ఇస్తారని భావిస్తుంటే… ఆయన మాత్రం త‌న సినిమాల‌కి బ్రేక్ వేయ‌డం లేదు. తాజాగా ర‌జ‌నీకాంత్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో “ద‌ర్భార్” సినిమా చేశారు. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా విడుద‌ల కానుంది. మ‌రి కొద్ది రోజుల‌లో శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 168వ సినిమాని చేయ‌నున్నాడు ర‌జ‌నీకాంత్‌. డిసెంబ‌ర్ లేదా జ‌న‌వ‌రిలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ర‌జ‌నీకాంత్ 169వ చిత్రంకి సంబంధించి తాజాగా ఓ వార్త కోలీవుడ్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అయితే ద‌ర్భార్ సినిమా రిలీజ్ కాక‌ముందే ర‌జనీకాంత్ 168,169 చిత్రాల‌కి సంబంధించి కొద్ది రోజులుగా ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. విశ్వాసం ఫేమ్ శివ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ 168వ చిత్రం రూపొంద‌నుండ‌గా, ఈ మూవీని భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించ‌నున్నారు. డిసెంబ‌ర్ మూడో వారంలో చిత్రం లాంచ్ కానుంద‌ని తెలుస్తుంది. కీర్తి సురేష్‌, జ్యోతిక‌, మీనా, ఖుష్బూ, మంజు వారియ‌ర్‌ల‌లో ఒక‌రు చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తారని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. తాజా స‌మాచారం ప్ర‌కారం ర‌జనీకాంత్‌కి జోడీగా మీనా ఎంపికైంద‌ని చెబుతున్నారు. మీనా ..ర‌జనీకాంత్‌తో క‌లిసి య‌జ‌మ‌న్‌, వీరా, ముత్తు అనే చిత్రాలు చేసింది. 90ల‌లో వీరిద్ద‌రిని హిట్ పెయిర్‌గా చెప్పేవాళ్ళు. మ‌రి మీనా, ర‌జ‌నీకాంత్ మ‌రోసారి వెండితెర‌పై సంద‌డి చేయ‌నున్నార‌ని వ‌స్తున్న వార్త‌ల‌లో నిజ‌మెంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

Related posts