telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మీతో కలిసి నటించే అవకాశం ఇస్తారా ?… స్టార్ హీరోకు హీరోయిన్ డైరెక్ట్ రిక్వెస్ట్

Malavika

కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ కు ఇప్పుడు అక్కడ క్రేజ్ మాములుగా లేదు. “పేట” సినిమాతో ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే పెరిగింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విజయ్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తోన్న ‘మాస్టర్’ సినిమాలో నటిస్తోంది. ఇక ఈ అమ్మడు ధనుష్ పుట్టిన రోజుకు శుభాకాంక్షలు తెలుపుతూ అతనితో కలిసి నటించాలనే కోరికను బహిరంగంగా ప్రకటించింది. “మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు అద్భుతమైన సంవత్సరం ముందుంది. ధనుష్ సార్! మీతో పనిచేసే అవకాశం వస్తే సూపర్ సంతోషిస్తాను. త్వరలో మీతో కలిసి ఒక చిత్రంలో నటించే అవకాశం ఇస్తారా ?” అంటూ సూటిగా అడిగేసింది. మరి మాళవికకు ధనుష్ ఛాన్స్ ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఇక అదలా ఉంటే మాళవిక హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.

Related posts