telugu navyamedia
సినిమా వార్తలు

ఆర్టికల్ 370 రద్దుపై లావణ్య త్రిపాఠి స్పందన

Lavanya-Tripati

కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తున్నట్లు సోమవారం రాజ్యసభలో హోంశాఖ మంత్రి అమిత్‌షా పకటించిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ కి ఉన్న ఈ స్వయం ప్రతిపత్తిని తొలగించాలని చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ఈ రోజు ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ బిల్లు కేంద్ర కేబినేట్ లో ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రపతి ఆమోదం పొందుతూ గెజిట్ విడుదలైంది. దీంతో 70 ఏళ్ళుగా కాశ్మీర్ విషయంలో కొనసాగుతున్న స్వయం ప్రతిపత్తి రద్దయింది. అయితే ఇప్పటి వరకు ఒకే రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము, కాశ్మీర్ మరియు లడాక్ లుగా విడిపోనుంది. అయితే జమ్మూ కాశ్మీర్ లు అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతాలు కాగా, లడాక్ ను అసెంబ్లీలేని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. ఆర్టికల్ రద్దుపై దేశ వ్యాప్తంగా మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు ఈ రద్దుని సమర్థిస్తున్నారు. మరికొందరు ఇది సరైనది కాదనే అభిప్రాయంతో ఉన్నారు. మెజారిటీ పరంగా చూస్తే ఎక్కువ మందికి ఈ రద్దు సరైనదే అనిపిస్తుంది. ఈ రద్దుపై చాలా మంది తమ అభిప్రాయాల్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీనిపై సినిమా తారలు కూడా తమ అభిప్రాయాలను తెలిపారు. వారిలో ముఖ్యంగా “అందాల రాక్షసి” సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన లావణ్య త్రిపాఠీ కూడా ఈ విషయమై స్పందించింది. ఆర్టికల్ 320 రద్దు సరైన నిర్ణయమని ఈ నిర్ణయం తీసుకున్నందుకు భారత ప్రభుత్వానికి అభినందనలు చెప్తూ ట్వీట్ చేసింది. లావణ్య త్రిపాఠి చివరగా “అంతరిక్షం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Related posts