telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ అద్దెను ఇప్పటికీ రాకేష్ రోషన్ చెల్లిస్తున్నాడు… హృతిక్ ను టార్గెట్ చేసిన కంగనా

kangana

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తాజాగా మరోసారి హృతిక్ రోషన్ ను టార్గెట్ చేసింది. ఇటీవలే సుశాంత్ మృతి పట్ల వారసత్వం.. బంధుప్రీతి గురించి మాట్లాడిన కంగనా మాటలు పెద్ద దుమారమే రేపాయి. ఇటీవల ఓ ఇంటర్వూలో తన లైఫ్ గురించి మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. “ఒకప్పుడు నేను ‘డబ్బు – అత్యాశ’ లాంటి ట్యాగ్ లైన్లను విన్నా.. కానీ ఇప్పుడు నాకు ముంబైలో సొంత ఇల్లు.. విలాసవంతమైన ఆఫీసు ఉన్నందుకు గర్వపడుతున్నట్లు చెప్పింది. అంతేగాక మాజీ బాయ్ ఫ్రెండ్ హృతిక్ రోషన్ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాడని..కానీ ఆ ఇంటి అద్దెను అతని తండ్రి రాకేష్ రోషన్ చెల్లిస్తున్నాడని ఎద్దెవా చేసింది.కంగనా హృతిక్ పై చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా హృతిక్ రోషన్- కంగనా రనౌత్ ల మధ్య జరిగిన గొడవ దేశ వ్యాప్తంగా హెడ్ లైన్స్ లో నిలిచింది. తన మాజీ ప్రియుడు అంటూ అప్పట్లో కంగనా వ్యాఖ్యలు చేయడం.. ఆ తర్వాత లీగల్ నోటీసుల దాకా వెళ్లడం తెలిసిందే..! ఈమెయిల్స్ బయటకు రావడం.. కంగనా హృతిక్ వెంటపడింది అంటూ అప్పట్లో ప్రచారం చేశారు. కొద్దిరోజుల తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది.

Related posts