telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సూర్యతో కాజల్ లిప్ లాక్ నిజం కాదట…!!

Kajal

తమిళ హీరో సూర్య, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘బ్రదర్స్‌’. కే.వి ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేశారు. సినిమాలో నటించిన విషయం తెలిసిందే. విభిన్నకథతో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య, కాజల్ లిప్‌లాక్‌ సీన్‌ ఉంటుంది. ఆ సీన్‌పై కాజల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ ఆ సినిమా షూటింగ్‌లో ముందుగా ముద్దు సీన్‌ లేదని, తరువాత ఆ సీన్ చాలా ముఖ్యం అని భావించడంతో దాన్ని తీయాలని నిర్ణయించారని, కానీ సూర్య చాలా ఇబ్బంది పడ్డారని తెలిపింది. దీంతో దర్శకుడు ఆనంద్‌ తమ ఇద్దరి మధ్య ఆ సీన్‌ను వినూత్న రీతిలో బ్లూ మ్యాట్‌ ముందు సూర్యను కుర్చీలో కూర్చోపెట్టి తీశారని చెప్పింది. ఓ గ్లాస్‌పై ముద్దుపెట్టించి దాన్ని తీశారని చెప్పింది. అనంతరం తనకు ఎదురుగా బ్లూమ్యాట్‌తో తయారు చేసిన ఓ బొమ్మను పెట్టి దానికి ముద్దు పెట్టించారని వివరించింది. ఆ తర్వాత తమ ఇద్దరి ముద్దులను గ్రాఫిక్స్‌లో ఒక్కటి చేసి లిప్‌లాక్‌లా చూపించారని చెప్పింది. అది గ్రాఫిక్స్ అని ఎవ్వరూ గుర్తించలేకపోయారని చెప్పుకొచ్చింది చందమామ.

Related posts