telugu navyamedia
సినిమా వార్తలు

వాడు నా నడుము గిల్లాడు… : హేమ

Hema

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన నటి హేమ. తాజాగా ఆమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. త్రివిక్రమ్ సినిమాల్లో నటించట్లేదు. ఎందుకనే ప్రశ్న ఎదురవగా… ఓ సినిమాలో నా పారితోషికాన్ని నిర్ణయించడానికి అతనెవరు ? అంటూ మండిపడింది. ఆ తరువాత పూరి జగన్నాథ్, ఛార్మీల రిలేషన్ పై కూడా స్పందించింది. ఈ సందర్భంగా “మీటూ”కు సంబంధించిన ప్రశ్న ఎదురవగా… తనకు ఇండస్ట్రీలో ఎలాంటి లైంగిక వేధింపులు ఎదురుకాలేదని, కానీ పబ్లిక్ లోనే ఓ వ్యక్తి తన నడుము గిల్లాడని తెలిపింది. రియల్ స్టార్ శ్రీహరి మరణించిన సమయంలో ఆయనను చూడడానికి వెళ్లగా… అక్కడ వందల మంది గుమిగూడారు. చాలామంది ఉన్న ఆ సమయంలో ఎవరో ఒక వ్యక్తి తన నడుము గిల్లాడట. వెంటనే అప్రమత్తమైన హేమ అతడిని పట్టుకుని చితక్కొట్టిందట. ఇలాంటి చేదు అనుభవాలు చాలామంది సెలెబ్రెటీలకు ఎదురవుతాయని చెప్పుకొచ్చింది హేమ.

Related posts