telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జెనీలియా రీఎంట్రీ… ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం ?

Genelia

హా.. హా.. హాసినీ అంటూ బొమ్మరిల్లులో హీరోయిన్ జెనీలియా చేసిన హడావిడికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే పెళ్లి అయిన అనంతరం ఈ భామ నటనకు దూరమైంది. అయితే జెనీలియా త్వరలోనే రీ ఎంట్రీ ఇస్తుందని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. తాజాగా ఆమె రీ ఎంట్రీకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఇద్దరు బడా హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందట. ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా, మరొకరు జూనియర్ ఎన్టీఆర్. చిరంజీవి హీరోగా ‘లూసీఫర్’ రీమేక్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే కదా. ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహించబోతున్నారు. ఇందులో ఓ ముఖ్యమైన పాత్ర ఉందని, దానికోసం జెనీలియాను సంప్రదిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమా ప్రకటించారు. ఇందులో కథను మలుపు తిప్పే ఓ కీలక పాత్ర కోసం జెనీలియాను ఎంపిక చేసే అవకాశాలున్నాయని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.

Related posts