telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన భూమిక

Bhumika

సౌత్ లో అగ్ర హీరోలందరి సరసన నటించిన సీనియర్ హీరోయిన్ భూమిక తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు. తాజాగా భూమిక రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెం‌జ్‌లో పాల్గొన్నారు. గతంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి డైరెక్టర్ సంపత్ నంది, హీరోయిన్ భూమికా చావ్లాకు ఛాలెంజ్ విసిరారు. డైరెక్టర్ సంపత్ నంది ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన భూమికా చావ్లా ఈ రోజు తన నివాసంలో తన కుటుంబసభ్యులతో కలిసి మూడు మొక్కలు నాటారు. అనంతరం భూమికా చావ్లా మాట్లాడుతూ.. జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమమని కొనియాడారు. పెరిగిపోతున్న కాలుష్యానికి బ్రేక్ వేయడానికి ఇది ఒక వెపన్ లా పనిచేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. అంతేకాదు తన అభిమానులందరి ఈ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ను ముందుకు తీసుకుపోయేలా.. ప్రతి ఒక్క అభిమాని మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చింది. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్ గారికి భూమిక కృతజ్ఞతలు తెలిపారు.

Related posts