telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పెళ్ళికి సిద్ధమైన మరో హీరోయిన్… నిశ్చితార్థం కూడా… !

Archana

2004లో నేను సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ సినిమాలు చేసింది. అయితే సరైన హిట్ లేకపోవడంతో హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. బిగ్‌బాస్ సీజన్-1 కంటెస్టెంట్‌గా అందరికీ గుర్తుండిపోయింది. సినీ కెరీర్ ఇక ముగిసినట్టే కనిపిస్తుండటంతో పెళ్లి చేసుకోనుంది అర్చన. ఇప్పటికే తాను ఓ వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్నట్టుగా చెప్పకనే చెప్పిన ఈ బ్యూటీతాజాగా నిశ్చితార్థం కూడా చేసుకుంది. ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు జగదీశ్‌తో సినీ నటి అర్చన (వేద) నిశ్చితార్థం వైభవంగా జరిగింది. బంజారాహిల్స్‌లోని హోటల్ రాడిసన్ బ్లూలో గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నటులు సుమంత్, నవ్‌దీప్, శివబాలాజీ, నటి మధుమిత తదితరులతోపాటు ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు హాజరయ్యారు. అర్చన-జగదీశ్‌లు నిశ్చితార్థపు ఉంగారాలను ఒకరికొకరు తొడుక్కున్న తర్వాత వేద తల్లిదండ్రులు విజయ శాస్త్రి-సుధాకర్ శాస్త్రి, జగదీశ్ తల్లిదండ్రులు ప్రతిభ-భక్తవత్సలం దంపతులతోపాటు కార్యక్రమానికి హాజరైన బంధువులు, స్నేహితులు వారిని ఆశీర్వదించారు. ప్రస్తుతం అర్చన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Related posts