telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తల్లి కాబోతున్న హీరోయిన్

Anita

హీరోయిన్ అనిత అభిమానులకు అనిత గుడ్ న్యూస్ చెప్పారు. ఆమె తల్లి కాబోతున్నట్టు భర్తతో కలిసి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ మేరకు ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. భర్త రోహిత్ రెడ్డితో వివిధ దశలలో తీసుకున్న క్లిప్స్‌ను మిక్స్ చేసి వీడియోలో చివరిగా తన గర్భాన్ని చూపించి మురిసిపోయారు. అంతేకాదు, ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కి పెట్టిన కొటేషన్‌లో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు అనిత. కొవిడ్-19 లాక్‌డౌన్ వల్ల తాను గర్భం దాల్చిన విషయం బయట ప్రపంచానికి తెలియలేదని అన్నారు. తాను ఇంట్లో నుంచి బయటికి వెళ్లకపోవడం వల్ల మీడియా కన్ను తనపై పడలేదని నవ్వుతూ చెప్పారు. ఇలాంటి వార్తను ఎవరికీ తెలియకుండా దాచిపెట్టడం కూడా కష్టమేనని, అందుకే ఇదే సరైన సమయమని భావించి ప్రకటించామని అనిత వెల్లడించారు. 2013లో రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక కూడా కొన్నాళ్లు నటించారు. ప్రస్తుతం ఆమె నటనకు దూరంగా కుటుంబానికి దగ్గరగా ఉన్నారు. 2021 ఫిబ్రవరిలో అనిత తన బిడ్డకు జన్మనివ్వనున్నారు. కాగా ప్రస్తుతం అనిత వయసు 39 ఏళ్లు. కాగా… ‘నువ్వు నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అనిత. టాలీవుడ్‌లో మాత్రం అనిత స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయారు. అయినప్పటికీ ఆమె తొలినాళ్లలో చేసిన సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపే వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, పంజాబీ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన అనిత.

 

View this post on Instagram

 

❤️+❤️=❤️❤️❤️ Love you @rohitreddygoa #gettingreadyforreddy

A post shared by Anita H Reddy (@anitahassanandani) on

Related posts