telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కంగనాకు మద్దతుగా విశాల్…

kangana

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై పోరాటం చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు పలువురి మద్దతు లభిస్తోంది. తాజాగా కంగనాకు హీరో విశాల్ తన మద్దతును ప్రకటిస్తూ సోషల్ మీడియా ద్వారా ఆమెకు ఒక లేఖను పంపాడు. ‘డియర్ కంగన… నీ గట్స్ కు, ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్. నీ వ్యక్తిగత సమస్య కానప్పటికీ ఒక ప్రభుత్వాన్ని నీవు ఎదుర్కొంటున్నావు. ధైర్యంగా నిలబడ్డావు. 1920లలో భగత్ సింగ్ లా కనిపిస్తున్నావు. ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు తమ గొంతుకను ఎలా వినిపించాలో ప్రజలకు చూపించావు. ఒక సెలబ్రిటీనే కాకుండా ఒక సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీయవచ్చనే సందేశాన్ని సమాజానికి ఇచ్చావు. నీకు వందనాలు’ అని విశాల్ అన్నాడు.

Related posts