telugu navyamedia
telugu cinema news trending

పెళ్ళికి సిద్ధమైన యువహీరో విశాల్

Vishal

ప్రముఖ నటుడు విశాల్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వైరల్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురైన అనీషాతో విశాల్ కి త్వరలోనే నిశ్చితార్ధం జరగబోతుందని విశాల్ తండ్రి, నిర్మాత జికె రెడ్డి మీడియా ముఖంగా వెల్లడించారు. గతంలో నడిగర్ సంఘం బిల్డింగ్ పూర్తైన తరువాతనే పెళ్లి చేసుకుంటానంటూ విశాల్ శపథం చేశారు. 2019 ఏప్రిల్ నాటికి బిల్డింగ్ నిర్మాణం పూర్తి కాబోతోంది. దీంతో విశాల్ పెళ్ళికి సిద్ధమయ్యారు. విశాల్, అనీషాల నిశ్చితార్ధం వేడుక హైదరబాద్ లోని ప్రముఖ హోటల్ లో జరగనుందని సమాచారం. ఈ వేడుకకు సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరవ్వనున్నారు.

అయితే ఇంతవరకూ విశాల్, కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రేమాయణం సాగిస్తున్నారని, త్వరలోనే వీరి పెళ్ళి అంటూ సోషల్ మీడియా కోడై కూసిన విషయం తెలిసిందే. మరోవైపు వీరిద్దరూ ఈ విషయాన్ని ఖండించినప్పటికీ ఈ జంటపై వస్తున్న ప్రేమ వార్తలు మాత్రం ఆగలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వరలక్ష్మీ శరత్ కుమార్ తాము మంచి స్నేహితులం మాత్రమేనంటూ ఈ విషయంపై మరోసారి స్పష్టతనిచ్చింది. ఇక ప్రస్తుతం విశాల్ ‘అయోగ్య’ సినిమాలో నటిస్తున్నారు.

Related posts

పోర్న్ సైట్స్ లో చిన్మయి ఫోటోలు… సమస్య రాజకీయాల వరకు…

vimala p

ఉపాధ్యాయుడితో అనుచిత ప్రవర్తన.. 6 విద్యార్థుల సస్పెండ్..

vimala p

తెలంగాణ టెట్.. ఈసారి ఆన్ లైన్ విధానం..

vimala p