telugu navyamedia
సినిమా వార్తలు

మద్యం మత్తులో నటుడి రచ్చ… మరో నటుడిపై దాడి…

vimal

మద్యం మత్తులో కొట్టుకున్న ఇద్దరు కోలీవుడ్ నటులు కొట్టుకున్న ఘటనపై కేసు నమోదైంది. నటుడు విమల్ మద్యం సేవించి మరో నటుడిపై దాడికి దిగడం కోలీవుడ్ లో సంచలనంగా మారింది. విరుగంబాక్కంలోని ఓ అపార్టుమెంట్లో నటిస్తున్నాడు వర్ధమాన నటుడు అభిషేక్. “అవన్ ఇవళ్ ఆదు” అనే తమిళ చిత్రంలో నటించాడు అభిషేక్. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి తమ అపార్టుమెంట్ ఎక్కి ఫోన్ మాట్లాడుకుంటున్నాడు అభిషేక్. మరో నటుడు విమల్ మద్యం మత్తులో నలుగురు అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. “ఇక్కడ కాసేపు కూర్చోవచ్చా ?” అని అభిషేక్ ను అడిగాడు విమల్. దానికి సమాధానంగా అభిషేక్ ఇంటి యజమాని తాను కాదని, తనకు సంబంధం లేదని చెప్పాడు. దీంతో విమల్, అభిషేక్ తో వాగ్వావాదానికి దిగాడు. విమల్ తన అనుచరులతో కలిసి అభిషేక్ పై దాడి చేయగా, గాయాలపాలైన అభిషేక్ వడపళనిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అనంతరం విమల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు విమల్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

Related posts