telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీఎంను పొగిడినందుకు సినీ నటుడికి చేదు అనుభవం

సీఎం జగన్ ను పొగిడినందుకు సినీ నటుడు విజయ చందర్ కు చేదు అనుభవం ఎదురైంది. గుంటూర్ లోని వెంకటేశ్వర దేవాలయంలోని అన్నమయ్య కళావేదికలో సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశారు .దీనికి ముఖ్య అతిధి గా హాజరయిన విజయ్ చందర్ జగన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తుండగా ప్రేక్షకులు వాగ్వాదానికి దిగారు. ఇదేమి పట్టించుకోని ఏపీ ఫిల్మ్ , టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయచందర్ తన పొగడ్తలు కొనసాగిస్తుండగా ప్రేక్షకులు తీవ్ర వ్యతిరేకతతో స్టేజి వైపు దూసుకు వచ్చారు.

ఊహించని సంఘటనతో కంగారుపడి ప్రసంగం మధ్యలోనే ముగించాడు.
అయినా శాంతించని ప్రేక్షకులు స్టేజి పైకి ఎక్కేందుకు ప్రయత్నించగా పరిస్థితి అదుపు తప్పుతుందని గమనించిన నిర్వాహకులు అర్దాంతరంగా విజయచందర్ ను సభ నుండి కారు వద్దకు తీసుకవెళ్లే ప్రయత్నం చేశారు. మార్గ మధ్యలో మహిళలు కూడా రాక్షసుడిలా మా భవిష్యత్ ను నాశనం చేస్తూ,రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తుంటే నీకు దేవుడిలా కనిపిస్తున్నాడా అంటూ విజయచందర్ పై వాగ్వాదానికి దిగారు. వెంటనే క్షమాపనలు చెప్పడంతో ప్రేక్షకులు కారుకు దారివ్వడంతో వెనుదిరిగారు.

Related posts