telugu navyamedia
news telugu cinema news

ఆ సినిమా నుండి తప్పుకున్నట్లు ప్రకటించిన విజయ్ సేతుపతి…

Vijay-Sethupathi

శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళిధరన్ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే . తన స్పిన్ మాయాజాలంతో మహా మహా బ్యాట్స్ మెన్ ను సైతం బోల్తా కొట్టించి .. పెవిలియన్ కి పంపిన ఘనత అతనిది. బౌలర్ గా తన పేర ఎన్నో రికార్డులను లిఖించుకున్నాడు. అలాంటి మురళిధరన్ జీవిత కథ లో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి ‘800’ అనే టైటిల్ని నిర్ణయించారు. 800 చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ – వివేక్ రంగచారి నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి అనేక విమర్శలు వస్తున్నాయి. 800 మోషన్ పోస్టర్ లాంచ్ తరువాత ‘షేమ్ ఆన్ విజయ్ సేతుపతి’ అనే యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ అయ్యింది. శ్రీలంక ప్రభుత్వం చారిత్రాత్మకంగా తమ దేశంలోని తమిళులను అణచివేస్తున్నది. జాతి ఆధారంగా వివక్షను పాటించే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్ జీవితాన్ని తెరపై చూపిస్తారా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాను తప్పుకుంటున్నట్టు విజయ్ సేతుపతి ప్రకటించాడు. మురళి ధరన్ కూడా తన పై సినిమా తీయవద్దు అంటూ ఓ లేఖను విడుదల చేసాడు. ఈ లేఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో తన పై సినిమా తీయకపోవడమే ఉత్తమమని మురళి ధరన్ పేర్కొన్నాడు. దానికి విజయ్ సేతుపతి స్పందిస్తూ .. తాను సినిమానుంచి తప్పుకుంటున్నానని అని ప్రకటించాడు.

Related posts

టెంపర్ రీమేక్… సీపీ సజ్జనార్ పై ప్రశంసలు

vimala p

కరోనా కట్టడికి ప్రభుత్వ చర్యలు అధ్వానం: నారా లోకేశ్

vimala p

అసెంబ్లీ సమావేశాల అనంతరం .. ఏపీసీఎం విదేశీ పర్యటన..

vimala p