telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వెబ్ సిరీస్ వైపు అడుగులేస్తున్న విజయదేవరకొండ

Vijay-Devarakonda

ప్రస్తుతం ఎంటర్టైన్ మెంట్ రంగంలో వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్స్ అందరూ వెబ్ సిరీస్ లపై దృష్టిని సారిస్తున్నారు. సమంత, ప్రియమణి, నందిని రెడ్డి, క్రిష్ తదితరులు ఇప్పటికే వెబ్ సిరీసుల్లోకి దిగిపోయారు. తాజాగా క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కూడా వెబ్ సిరీస్ కు ప్లాన్ చేశాడు. తాను స్థాపించిన ప్రొడక్షన్ హౌస్ ‘కింగ్ ఆఫ్ ది హిల్’ ద్వారా వెబ్ సిరీస్ నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ ఉంటుందని సమాచారం. ఇప్పటికే ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ కు విజయ్ బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ‘ఫైటర్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా నిరూపించుకునేందుకు సెట్స్‌పై ముస్తాబవుతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ హీరో విలక్షణ చిత్రాల డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

Related posts