telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బాలీవుడ్ సీనియర్ నటి విద్యాసిన్హా కన్నుమూత

vidya sinha actor

ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి విద్యాసిన్హా (71) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విద్యాసిన్హా ముంబైలోని క్రిటికేర్ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ గురువారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. 1974లో విద్యా సిన్హా కెరీర్ ప్రారంభమైంది. విద్యా సిన్హా నటించిన తొలి చిత్రం రజనీగంధ. ఆ తర్వాత ఛోటి సి బాత్, మేరా జవాన్, ఇంకార్, జీవన్ ముక్త్, బాడీగార్డ్ తోపాటు పలు చిత్రాల్లో నటించారు. విద్యాసిన్హా పలు టీవీ సీరియళ్లలో కూడా నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. విద్యా సిన్హా చివరగా 2011లో విడుదలైన బాడీ గార్డ్ సినిమాలో సల్మాన్ ఖాన్ తో నటించారు.ఈ చిత్రంలో విద్యా సిన్హా కీలక పాత్రలో నటించారు.

Related posts