telugu navyamedia
telugu cinema news trending

తనుశ్రీ దత్తా న్యాయవాదిపై లైంగిక వేధింపుల కేసు నమోదు

Thanu shree

బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా మీటూ ఉద్యమంతో పెను దుమారం రేపింది. నానా పాటేకర్‌పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలతో బాలీవుడ్‌లో మీటూ ఉద్యమం ఊపందుకుంది. నానా పాటేకర్‌పై కేసులో తనుశ్రీ దత్తా తరపున న్యాయవాది నితిన్‌ సాట్పుటే వాదించారు. అయితే తాజాగా న్యాయవాది నితిన్‌ సాట్పుటేపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. బాంద్రా పశ్చిమ సబర్బ్‌ ప్రాంతంలో ఓ మహిళను దుర్భాషలాడినందుకుగాను కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యాలయం వెలుపల తనును అసభ్య పదజాలంతో దూషించినట్లుగా 47 ఏళ్ల ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ సమావేశం నిమిత్తం మహిళా కమిషన్‌ కార్యాలయానికి వచ్చినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై సెక్షన్‌ 354ఏ తోపాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై న్యాయవాది స్పందిస్తూ… ఫిర్యాదుపై దర్యాప్తు జరుగుతుందన్నారు.

Related posts

ధోనీకి అందుకే అవకాశం రాలేదు .. వెస్టిండీస్ టీ 20పై .. గంగూలీ ..

vimala p

బాలీవుడ్ లో “పుల్వామా” ఘటనపై సినిమాకు రంగం సిద్ధం

vimala p

కిటికీకి వేలాడుతున్న మూడేళ్ళ బాలుడు… గాఢ నిద్రలో తండ్రి… చివరకు…

vimala p