telugu navyamedia
telugu cinema news trending

విలన్ గా సునీల్ కొత్త అవతారం…!

sunil back as star comedian

ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు సునీల్ హీరోగా మారి పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. రెండు, మూడు సినిమాలు హిట్ అయినప్పటికీ ఆ తరువాత వరుస ఫ్లాప్ లు పలకరించడంతో సరైన అవకాశాలు రాక ఇటీవలే మళ్ళీ కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా వివరాలను చిత్ర బృందం ప్రకటించింది. అమృత ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ‘కలర్‌ ఫోటో’ చిత్రంలో సునీల్‌ విలన్‌గా కనిపించనున్నారు. ‘మజిలీ’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘ప్రతిరోజూ పండగే’ వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న సుహాస్‌ ఈ చిత్రంతో హీరోగా, యూట్యూబ్‌లో పాపులర్‌ అయిన సందీప్‌ రాజ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చాందిని చౌదరి కథానాయిక. సాయి రాజేశ్‌ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాతలు. “1995లో ఒక ఇంజనీరింగ్‌ కాలేజీలో జరిగే ప్రేమకథ ఇది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. మరిన్ని విశేషాలు త్వరలో తెలియజేస్తాం” అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

Related posts

ట్రైన్ టికెట్ .. మరొకరిపేరుతో ఇలా మార్చేయండి..

vimala p

భారత్, చైనాలు .. సుంకాలతోనే బ్రతికేస్తున్నాయి.. : ట్రంప్

vimala p

సాహో చిత్రం … ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అంతా సిద్ధం.. మీరు సిద్ధమా..

vimala p