telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ ఓడిపోవడానికి పవనే కారణం: సుమన్

janasena pawan and suman

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ప్రముఖ సినీ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఓటమికి పవన్ కల్యాణే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం నాడు పశ్చిమగోదావరి జిల్లాలో సుమన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .ఒక పార్టీకి ఇన్ని ఎక్కువ సీట్లు రావడాన్ని తాను పుట్టిన తర్వాత చూడటం ఇదే తొలిసారని అన్నారు.

ఎన్నో కష్టాలు పడి జగన్ ఘనవిజయం సాధించారని అభినందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడం ద్వారా సమన్యాయం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. సినిమా పరిశ్రమను కూడా ఏపీకి తీసుకొచ్చి అన్ని విధాలా ఆదుకోవాలని జగన్‌కు సూచించారు.

Related posts